ఇద్దరు మెగాస్టార్లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి పని చేసిన ఎంతో మంది ప్రముఖ టెక్నీషియన్స్‌లో మెగా డాటర్ సుస్మిత ఒకరు. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది సుస్మిత. తండ్రి చిరంజీవి కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడంతో పాటు అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ని కూడా ఆమె డిజైన్ చేశారు.
షెడ్యూల్‌కి తగ్గట్లుగా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు అమితాబ్ బచ్చన్ సుస్మితను ప్రత్యేకంగా అభినందించేవారట. ఆమె డిజైన్ చేసిన కాస్టూమ్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారట. ఇక చిరంజీవి నటించిన చాలా సినిమాలకు సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. కానీ ‘సైరా’ సినిమా తనకెంతో ప్రత్యేకమని ఆమె చెబుతోంది.
ఇలాంటి ఓ చారిత్రాత్మక చిత్రానికి దుస్తులు డిజైన్ చేయడమమంటే నిజంగా కత్తి మీద సామే అని పేర్కొంది. ఈ విషయంలో తనకు మిగిలిన టెక్నీషియన్లు అందించిన సహకారం, తమ్ముడు రామ్‌చరణ్ అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పవని సుస్మిత తెలిపింది. ఇక అక్టోబర్ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.