Home సంగారెడ్డి ప్రసవాలకు అమ్మఒడి పథకం వరం

ప్రసవాలకు అమ్మఒడి పథకం వరం

AMMA-ODI

మన తెలంగాణ/నారాయణఖేడ్ : మహిళల ప్రసవాలకు అమ్మ ఒడి పథకం రాష్ట్ర ప్రభుత్వం వరంలా ప్రవేశ పెట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం డివిజన్ కేంద్రమైన నారాయణఖేడ్‌లో స్థానిక ఎమ్మెల్యే అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 102 వాహనాలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన ఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 102 ఐదు వాహనాలను పంపించడం హర్షనీయమన్నారు. ఇక్కడి ప్రాంతంలో గత పాలకుల నిర్లక్షం కారణంగా రహదారులు లేక ఎడ్ల బండిపై ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం తీసుకురాగా మార్గమధ్యలోనే ఎన్నో ప్రసవాలు జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. మహిళలకు పునర్‌జన్మ అయిన ప్రసవం ఆరోగ్యవంతంగా జరగాలనే ఉద్ధేశంతో 102 వాహనాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గాయత్రిదేవి, జెడ్పీటీసీ నిరంజన్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిఈ జిల్లా సభ్యులు రవీందర్‌నాయక్, ఉప సర్పంచ్ నజీబ్, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీటీసీ ముజామ్మిల్, మాజీ ఎంపీపీ జీవులానాయక్, గోవింద్‌యాదవ్, హెల్త్ అసిస్టెంట్ జట్ల భాస్కర్, వైద్యులు చౌహాన్, ప్రహ్లాద్, రాజేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సిఎం రిలిఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యానికి గురైన కుటుంబాలకు చెక్కుల పంపిణీతోపాటు ఎల్‌ఓసీ ద్వారా వైద్య చికిత్సలను నిర్వహించుకునేందుకు అనుమతి పత్రాలను అందజేశారు. నారాయణఖేడ్‌కు చెందిన పార్వతి కుటుంబానికి రూ.19వేలు, నవీన్‌గౌడ్ కుటుంబానికి రూ.12.500ల చెక్కులను అందజేసిన అనంతరం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన ఎండి.అమ్జాద్ చికిత్సలు నిర్వహించుకునేందుకు రూ.2లక్షల ఎల్‌ఓసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట సర్పంచ్ జంగం శ్రీనివాస్, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ బాసిత్, గౌస్‌చిస్తి, సంతోష్, రామక్రిష్ణ, రవీందర్, సతీష్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.