Home సిద్దిపేట అమ్రిత్ ఫార్మసి సిద్దిపేటలోనే…

అమ్రిత్ ఫార్మసి సిద్దిపేటలోనే…

మొట్టమొదటి అమ్రిత్ ఫార్మసీ సిద్దిపేటలోనే
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చొరవతోనే సాధ్యం
24 గంటలు సామాన్యులకు అందుబాటులో
45 రోజుల్లో అమ్రిత్ ఫార్మసీ ప్రారంభోత్సవం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్‌ఎల్‌ఎల్ ప్రతినిధి మురళీధర్‌రావు

సిద్దిపేట: రాష్ట్రంలో మొట్టమొదటి అమ్రిత్ ఫార్మసి సిద్దిపేట మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్‌ఎల్‌ఎల్ ప్రతినిధి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి,ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సామాన్యులకు 24 గంటలు సేవలందించేందుకు అమ్రిత్ ఫార్మసి అందుబాటులోకి రానుందన్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజలకే కాక ఇతర ప్రాంత ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన హెచ్‌ఎల్‌ఎల్ ( హెల్త్ లైఫ్ కేర్ లిమిటెడ్) ఆధ్వార్యంలో ఈ అమ్రిత్ ఫార్మసి నిర్వహించబడుతుందన్నారు. త్వరలోనే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా పలు ఆస్పత్రుల్లో ఈ విధమైన ఫార్మసిలు నెలకొల్పబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డైరెక్టర్ తమిళ్ అరసి, సూపరిండెంట్ చంద్రశేఖర్, నాగరాజు తదితరులు ఉన్నారు.

 

Amrit Pharmacy in Siddipet