Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నిన్న వర్షిణి.. నేడు ద్వారక

నిన్న వర్షిణి.. నేడు ద్వారక

rape

 

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య, పట్టించిన భార్య

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం నాడు ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి మువ్వ ద్వారకను అత్యాచారం చేసి ఆపై హత్యగావించి గోనెసంచిలో ముటగట్టిన విషయం సోమవారం వెలుగుచూసింది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాశ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేసి మృతదేహం ఓ గోనె సంచిలో దాచిన విషయాన్ని అతని భార్య స్థానికులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద్వారక తల్లి ఇంటి పక్కనే ఉన్న కళాశాలలో స్వీపర్‌గా ఉద్యోగం చేస్తోంది.

విధులు ని ముగించుకుని ఆమె ఇంటికి వచ్చింది. అయితే ఆడుకోవడానికి వెళ్లిన తన కూతురు ద్వారక ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికింది. అయినప్పటికీ చిన్నారి ఆచూకి ఏమాత్రం తెలియలేదు. దీంతో ద్వారక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి ద్వారక మిస్సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సిసిటివి పుటేజీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లలో తనిఖీలు చేశారు.

ఈ నేపథ్యంలో ద్వారక ఉంటున్న పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రకాశ్ అత్యాచారానికి పాల్పడిన తరువాత చిన్నారిని హతమార్చి మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు. అయితే భర్త ప్రవర్తనలో తేడా గమనించిన ప్రకాశ్ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ప్రకాశ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుమార్తె ద్వారక మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని విచారిస్తున్నారు. కాగా చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

An eight-year-old child raped