Home తాజా వార్తలు రైలు ఢీకొని ఏనుగు మృతి

రైలు ఢీకొని ఏనుగు మృతి

Elephant

డెహ్రాడూన్: రైలు ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించడానికి రైల్వే శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోతోంది. ఉత్తరఖాండ్ రాష్ట్రం ననిటాల్ జిల్లా లాల్ కౌన్ జిల్లాలో ఆదివారం రైలు ఢీకొని ఏనుగు మృతి చెందింది.  లోకో పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.  అటవీ శాఖ అధికారులు లోకో పైలెట్ పై కేసు నమోదు చేశారు. జంతు వైద్యులు ఏనుగు కళేబరానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు.