Home తాజా వార్తలు గంగూలి పదవీకాలం పొడిగింపు

గంగూలి పదవీకాలం పొడిగింపు

Ganguly

 

బిసిసిఐ రాజ్యాంగాన్ని సవరించే యోచన

ముంబయి : భారత క్రికెట్ అధ్యక్షుడిగా ఇలీవల పగ్గాలు చేపట్టిన సౌరబ్ గంగూలి పదవీ కాలాన్ని పొడిగించే యోచనలో బిసిసిఐ ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 1న గంగూలి అధ్యక్షతన బిసిసిఐ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బిసిసిఐ రాజ్యాంగాన్ని సవరించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బిసిసిఐ పాలకవర్గంలో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం కాగా, సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. ఒక వేళ న్యాయస్థానం అంగీకరిస్తే దాదా ఈ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగుతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలి తొమ్మిది నెలలు మాత్రమే బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగాల్సి ఉంది. రెండో సారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బిసిసిఐ పాలకవర్గం ఈ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

An extension of Ganguly tenure