Tuesday, March 21, 2023

ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

- Advertisement -

 

stand

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తులను ఆర్జీదారుల నుండి ఓపికగా స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలపట్ల పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా  జన్కాపూర్ కాలనికి చెందిన కౌశల్య డబుల్‌బెడ్‌రూం గురించి, కెరమెరి మండలం చందుగూడ తాండకు చెందిన రాధాబాయి కళ్యాణలక్ష్మి డబ్బులు అంద డం లేదని, ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన సావిత్రి ఉద్యోగంకొరకు, రెబ్బెన మండలానికి చెందిన రాజ య్య ఫోర్‌లైన్ రోడ్డులో స్థలం పోయిందని నష్టపరిహారం కల్పించాలని ఫిర్యాదుచేశారు. అదే విధం గా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన మల్లికార్జున్ కరెంటుషాక్‌తో తన గేదె చనిపోయిందని నష్టపరిహారం ఇ ప్పించాలని, తదితర వినతిపత్రాలను కలెక్టర్‌కు బాధితులు అందించారు. ఈ ప్రజాఫిర్యాదులో మొత్తం 82 వరకు దరఖాస్తులువచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డివో సురేష్, డీఆర్‌డివో వెంకట్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News