- Advertisement -
మన తెలంగాణ/కూసుమంచి ః మండలంలోని నాయకన్‌గూడెం కెనాల్ బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని గ్రామానికి చెందిన గూపోజు రాజారత్నం అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహం వద్దకు పోలీసులు రాగా, పసుపు రంగు జాకెట్, పసుపు రంగు చీరతో కాలువలో బోర్లా పడి ఉన్న మహిళకు 35 సం.రాలు వయస్సు కల్గియున్న మహిళగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరళించారు. మృతదేహానికి సంబందించిన బందువులు కానీ, సంబందిత తాలూకా వారు ఎవరూ రాకపోవడంతో పోలీసులు వేచిచూస్తున్నట్లు కూసుమంచి ఎస్సై పి. రఘు తెలిపారు.
- Advertisement -