Home ఆఫ్ బీట్ వీడియోలు మీరేనా ట్రాఫిక్ జాం చేసేది.. నేనూ చేయగలను…!(వీడియో)

మీరేనా ట్రాఫిక్ జాం చేసేది.. నేనూ చేయగలను…!(వీడియో)

Anaconda Crossing Roadఅది ఎల్లప్పుడు వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే రోడ్డు. అంత రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పడకుండానే వాహనదారులు ఒక్కసారిగా తమకు తాముగా ఆగిపోయారు. వారు అలా ఆగిపోయింది ఎందుకో తెలుసా? అదే సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ప్రత్యేక ఆతిథికి దారి ఇవ్వడానికే. ఇంతకు ఆ ఆతిథి ఎవరో చెప్పలేదు కదూ. ఎవరో కాదు అనకొండ. అవును మీరు విన్నది నిజమే. ఓ పది అడుగుల అనకొండ రద్దీగా ఉన్న ఆ రోడ్డు దాటడం గమనించిన వాహనదారులు వెంటనే తమ వాహనాలను నిలుపుకోని మరీ దానికి దారి ఇచ్చారు. దాంతో అనకొండ మధ్యలో ఉన్న డివైడర్ ను దాటి రోడ్డు అవతలి వైపు ఉన్న పచ్చికల్లోకి వెళ్లిపోయింది. అనకొండ రోడ్డుక్రాస్ చేసిన దృశ్యాలను ఓ వాహనదారుడు తన మొబైల్ లో వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన బ్రెజిల్ లోని పోర్టో వేల్హోలో చోటుచేసుకుంది.

Anaconda Crossing Road Brings Traffic to Halt in Brazil