Friday, April 26, 2024

రాజుగారూ ఏడుగురు కొడుకులు

- Advertisement -
- Advertisement -

అనగనగా ఒక రాజు గారు వుండేవారు.
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు కలిగారు.
ఏడుగురు కొడుకులు పెద్దయ్యాక ఒక రోజు పల్లెటూరికెళ్లారు.
ఆ పల్లెటూరి వాళ్లు ప్రేమతో ఇచ్చిన ఏడు విత్తనాలు తీసుకొని వచ్చారు.
ఏడుగురు రాజకుమారులూ ఏడు విత్తనాలను రాజుగారి తోటలో నాటారు.
అందులో ఒక రాజకుమారుడు నాటిన విత్తనం మొలకెత్తలేదు
‘విత్తనం…. విత్తనం ఎందుకు మొలకెత్తలేదు’ అంటూ కోపంతో ప్రశ్నించాడు.
‘తోటమాలి నీరు పోయలేదు రాజకుమారా’
‘తోట మాలీ…. తోటమాలీ ఎందుకు నీరు పోయలేదు?’ మరింత కోపంతో అడిగాడు.
‘బావిలో నీరు లేదు రాజకుమారా’ అంటూ వణుకుతూ సమాధానమిచ్చాడు.
‘బావీ…. బావీ నీలో నీరు ఎందుకు లేదు?’ ప్రశ్నించాడు.
‘భూమిలో నీటి తేమ లేదు రాజకుమారా’. అంటూ సమాధాన మిచ్చింది.
‘భూమీ…. భూమీ ఎందుకు నీలో నీటి తేమలేదు’.
‘నా పైన వర్షం నీరు పడటం లేదు రాజకుమారా’ బాధపడుతూ చెప్పింది. ‘వర్షం నీరూ….. వర్షం నీరూ…. భూమిపై ఎందుకు పడటం లేదు’. ‘భూమిపై ప్లాస్టిక్ చెత్త వుండటంవల్ల నా నీరు భూమిని తాకలేదు రాజకుమారా’ కన్నీటితో చెప్పింది.
‘ప్లాస్టిక్ చెత్తా….. ప్లాస్టిక్ చెత్తా భూమిపై ఎందుకున్నావు’ సింహంలా గర్జించాడు రాజకుమారుడు.
‘పర్యావరణశాఖ ప్రమాదమంటున్నా వినకుండా ప్రజలు ప్రేమతో వాడుకున్న తరువాత భూమిపై వేస్తుంటే ఉండనా’ రాగం తీస్తూ పొగరుగా సమాధానమిచ్చింది ప్లాస్టిక్ చెత్త.

 

Anaganaga oka raju story in telugu

 

ఓట్ర ప్రకాష్ రావు, 97874 46026
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News