Sunday, June 15, 2025

పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో విద్యార్థిని తలపై బండ రాయితో కొట్టి.. హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తీసుకరావడంతో ఆమెను అతడు హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామకృష్ణ కాలనీలో లక్ష్మీపతి, అరుణ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. ఈ దంపతులకు తన్మయి అనే కూతురు ఉంది. తన్మయి నరేశ్‌లో ప్రేమలో పడింది. నరేష్‌కు భార్య పిల్లలు ఉండడంతో ఆమెను పెళ్లి చేసుకోనని పలుమార్లు చెప్పాడు. తన్మయి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో హత్య చేయాలని భావించాడు.

కూల్‌డ్రింక్ తెచ్చుకుంటానని ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లింది. కూడేరు మండలం గొట్కూరు ప్రాంతానికి ఆమెను బైక్‌పై నరేష్ తీసుకెళ్లాడు. తలపై బండరాయితో కొట్టి చంపేసి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో నరేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి ఆస్తి అటాచ్ చేసి సంక్షేమ పథకాలను రాకుండా ఆపేస్తామన్నారు. కేసు నమోదు చేయడంతో నిర్లక్ష్యం వహించిన పోలీస్ స్టేషన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తున్నామని ఎస్‌పి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News