Tuesday, March 21, 2023

అనంతగిరి ప్రాజెక్టు త్వరలో పూర్తి

- Advertisement -

harishమనతెలంగాణ/ఇల్లంతకుంట: కోటి ఎకరాలకు సాగు నీ రందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్షమని, 2018 మార్చి నెలాఖరులోగా కాళేశ్వరం 10వ ప్యాకేజి పనులలో భాగంగా నిర్మితమవుతున్న అనంతగిరి ప్రాజెక్టు నిర్మాణా న్ని పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజి 10లో మద్యమానేరు అనుసంధానంగా టన్నెల్ పనులు,సర్జిఫూల్, అనంతగరి రిజర్వాయర్ నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశీలిం చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ లోని ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్ సర్జిఫుల్ సంపు హౌజ్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. అనంతగిరి రిజర్వాయర్ 10వ ప్యాకేజి టన్నెల్ పనులను, సర్జిఫుల్ పంప్ హౌస్ నిర్మాణ పనులను స్వయంగా ఇంజనీరింగ్ అధికారులతో కలసి ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా అనంతగిరి రిజర్వాయర్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్ బావి సర్జిఫుల్ అన్నారు. 92 మీ టర్ల లోతు, 56 మీటర్ల వెడల్పుతో సర్జిఫుల్ నిర్మాణం జరిగిందన్నారు. మూడు గుట్టల మధ్యన 3.5 టిఎంసిల సామర్థంతో రిజర్వాయర్‌ను నిర్మించడం జరుగుతుందన్నారు. రెండు గుట్టల మధ్య నాన్ ఓవర్ ఫ్లో డ్యాంను 3లక్షల10వే క్యూబిక్ మీటర్లతో నిర్మించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 2లక్షల50వేల కాంక్రిటు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 60వేల క్యూబిక్ మీటర్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. 2018 మార్చి చివరి వారం లోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆ దేశించారు. బండ్ వన్ పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని, బండ్ టూ, బండ్ త్రీ పనులు మిగిలి ఉన్నాయని వీటి ని త్వరిత గతిన పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు అధికారు లు, యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రైతులకు త్వరగా  సాగునీరందించడమే లక్షంగా పనులు వేగవంతంగా సాగతున్నాయని, అందుకు ఇంజనీర్ అధికారులు, ప్రాజెక్టు సి బ్బంది పనులు చేస్తున్నారన్నారు. అనంతగిరి రిజర్వాయర్ పూర్తయితే లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయ న్నా రు. అనంతగిరి గ్రామస్థులకు వారు కోరుకున్న చోట పునరావాసం కల్పిస్తామని, లేదంటే డబ్బులు కూడా చెల్లించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా చేపల నుండి వచ్చే ఆదాయం మొత్తం నిర్వాసితులకే అందిస్తామని,శాశ్వత ఆదాయ వనరుగా ఉ ండిపోతుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రాజెక్టులను అ డ్డుకోవాలని కోర్టులలో కేసులు వేస్తున్నారని, ప్రాజెక్టులను, అభివృద్దిని అడ్డుకునే వారు రైతు వ్యతిరేకులన్నారు. రైతు శ్రేయస్సే కెసిఆర్ ధ్యేయమని, రైతులకు ఎకరానికి ఎరువుల పెట్టుబడి కోసం 4వేలను అందివ్వనున్నామని, ప్రతి 5వేల ఎకరాలకు ఓ వ్యవసాయ విస్తీరణ అధికారిని నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజ్ చైర్మన్ దేవిప్రసాద్, సిఇ హరిరామ్, ఎస్‌ఇ వేణు, ఇఇ ఆనంద్, ఎంపిపిగుడిసే అయిలయ్య, జడ్‌టిసి సిద్దం వేణు, తహసీల్దార్ శ్రీనివాస్, డిఇ ప్రసాద్,పార్టీ అధ్యక్షుడు గొడుగు తిరుపతి, స ర్పంచ్ మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News