Thursday, March 28, 2024

ఆర్యన్ కేసులో అనన్య వాంగ్మూలం

- Advertisement -
- Advertisement -

Ananya Panday questioned by NCB

ఎన్‌సిబి కార్యాలయంలో హాజరీ
సెల్‌ఫోన్, లాప్‌ట్యాప్ స్వాధీనం
వాట్సాప్ ఛాట్‌తో డ్రగ్స్‌లింక్?

ముంబై : ఆర్యన్ ఖాన్ సంబంధిత డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే గురువారం ఇక్కడి ఎన్‌సిబి అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆర్యన్ వాట్సాప్ ఛాట్స్ క్రమంలో అనన్య పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రముఖ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు అయిన ఆర్యన్ ఈ కేసులో బెయిల్ దక్కని స్థితిలో స్థానిక జైలులో ఉన్నారు. గురువారం ఈ కేసులో అనన్య తమ ముందు విచారణకు హాజరయినట్లు ఎన్‌సిబి వర్గాలు ధృవీకరించాయి. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అనన్య తండ్రి చుంకీ పాండే వెంటరాగా స్థానిక బల్లార్డ్ ఎస్టేట్‌లోని మాదకద్రవ్యాల నిరోధక సంస్థ కార్యాలయానికి వచ్చారు. కేసుకు సంబంధించి ఆమె వాంగ్మూలం నమోదుచేసుకోవల్సి ఉందని కార్యాలయానికి రావాలని ఈ రోజు ఉదయమే ఎన్‌సిబి బృందం ఇక్కడి బంద్రాలోని నటి నివాసానికి వెళ్లి సమన్లు వెలువరించింది. దీనికి అనుగుణంగానే ఆమె కార్యాలయానికి వచ్చారు.

ఎన్‌సిబి అధికారులు ఇప్పటికే అనన్య మొబైల్ ఫోన్‌ను, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనపర్చుకున్నారు. ఆర్యన్‌ఖాన్‌కు నటి అనన్యకు మధ్య సంభాషణ జరిగిన వైనం , ఇందులో కొంత డ్రగ్స్ వ్యవహారాల సమాచారం ఉన్నట్లు అనుమానించిన ఎన్‌సిబి ఆర్యన్ ఫోన్ వివరాల ప్రాతిపదికన అనన్యను విచారించినట్లు తెలిసింది. ఈ కేసులో అనన్య పాత్ర ఏ స్థాయిలో ఏ విధంగా ఉందనేది వెంటనే స్పష్టం చేయడానికి ఎన్‌సిబి వర్గాలు నిరాకరించాయి. ఎన్‌సిబి కార్యాలయం సమీపంలో గురువారం భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

షారూక్ ఇంటికి ఎన్‌సిబి బృందం

డ్రగ్స్ కేసుకు సంబంధించి మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారుల బృందం గురువారం ముంబైలోని షారూక్‌ఖాన్ నివాసానికి వెళ్లింది. ఈ కేసులో షారూక్ కుమారుడు అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఈ దశలో దర్యాప్తు సంబంధిత సమాచారం గురించి ఎన్‌సిబి వర్గాలు షారూక్ నివాసానికి వెళ్లాయి. శివార్లలోని బాంద్రాలో మన్నత్ పేరిట ఉన్న షారూక్ ఇంటికి ఎన్‌సిబి వర్గాలు వెళ్లడం కీలక పరిణామం అయింది. షారూక్ ఇంటికి వెళ్లామని, ఇది దాడులు సోదాల క్రమపు వ్యవహారం కాదని ఆ తరువాత అధికారులు తెలిపారు. మరో బృందం గురువారం నటి అనన్య నివాసానికి వెళ్లి, విచారణకు సమన్లు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News