Home తాజా వార్తలు రోజూ రెడ్ వైన్ తాగుతా : అనసూయ

రోజూ రెడ్ వైన్ తాగుతా : అనసూయ

Anchor And Actress Anasuya Reveals Her Beauty Secretsహైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటి అనసూయ తన గ్లామర్ రహస్యమేమిటో చెప్పింది. టాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనసూయకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేటి తరం నటీమణులతో పోటీ పడుతూ తన గ్లామర్ ను కాపాడుకుంటుంది. తాను గ్లామర్ గా ఉండడానికి కారణం రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగడమేనని ఆమె తేల్చి చెప్పింది. ఆకలి వేసినప్పుడు భోజనానికి బదులు తాను రెడ్ వైన్ ను తాగుతానని, డ్రై ప్రూట్స్ తీసుకుంటానని ఆమె పేర్కొంది. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని, గుండెకు ఎంతో మేలు చేస్తుందని అనసూయ చెబుతోంది. ఆకలిగా ఉన్న సమయంలో నిద్ర పట్టదని, దీంతో రాత్రి నిద్రపోయే ముందు భోజనానికి బదులుగా ఓ గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అయితే అందరికీ రెడ్ వైన్ వర్కవుట్ అవుతుందో లేదో తనకు తెలియదని, తనకు మాత్రం రెడ్ వైన్ తో మేలు జరుగుతుందని అనసూయ చెప్పుకొచ్చింది.