Home తాజా వార్తలు ‘పటాస్’ షో కి శ్రీముఖి బ్రేక్..

‘పటాస్’ షో కి శ్రీముఖి బ్రేక్..

anchor-srimukhiహైదరాబాద్: బుల్లితెరపై పటాస్ అనగానే మనకు గుర్తు వచ్చేపేరు యాంకర్ శ్రీముఖి. ప‌టాస్ కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిన శ్రీముఖి రాముల‌మ్మ‌గా ఫుల్ ఫేమస్ అయింది. ఆమె టాలీవుడ్ లో చిన్న చితకా సిన్మాలు చేసిన పెద్దగా క్రేజ్ రాలేదు. ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను పంచ్ డైలాగ్స్ తోనూ అందరిని అల‌రించింది. స్టూడెంట్స్‌తో ఈ అమ్మ‌డు చేసే ఫ‌న్ ఆడియ‌న్స్‌కి పిచ్చ కిక్ ఇచ్చేదనే చెప్పవచ్చు. ప‌టాస్ ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 ను ప్రారంభించారు.

అయితే శ్రీముఖి తన ట్వీట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ… నిర్వాహకుల అనుమతితోనే పటాస్ కి తాను బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపింది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్న‌ట్టు చెప్పింది. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెప్పిన రాములమ్మ.. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. మ‌రి శ్రీముఖి బ్రేక్ తీసుకోవ‌డంతో ప‌టాస్ స్టేజ్‌పై ర‌వికి జోడీగా ఎవరు యాంకర్ గా అల‌రిస్తుందో చూడాలి మరీ. అయితే, ప్ర‌స్తుతం అస‌సూయ‌, ర‌ష్మి త‌ర్వాత ఆ రేంజ్‌లో త‌న‌దైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ముద్దుగుమ్మల్లో ఒకరు యాంక‌ర్ శ్రీముఖి.

Anchor Srimukhi Break From Patas Show