Home తాజా వార్తలు కెటిఆర్… మీరు సూపర్ సర్… యాంకర్ సుమ

కెటిఆర్… మీరు సూపర్ సర్… యాంకర్ సుమ

Anchor suma meets minister ktr ahead of ghmc polls

 

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్‌తో సంభాషించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఆయన బృందం పనిచేస్తున్న తీరు అద్బుతమని ఆమె కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి ప్రజలంతా కృతజ్ఞతులై ఉంటారని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంత్రి కెటిఆర్‌ను ఇంటర్వూ చేసిన పాత ఫోటోలను శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈసందర్బంగా యాంకర్ సుమ మాట్లాడుతూ…మత్రి కెటిఆర్‌తో సంభాషించడం చాలా గొప్పగా అనిపించిందన్నారు. ఓ హైదరాబాదీగా మన నగర అభివృద్ధి, తదుపరి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

గత ఆరేళ్లతో పోల్చితే ఇప్పటికే హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి అయిందని, రాబోయే రోజుల్లో కూడా నగర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలపెట్టినందుకు మీకు మీ బృందానికి కుడోస్ సర్ అని సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి “నేను షోలలో గడగడ ఆపకుండా మాట్లాడుతుంటా, కానీ మీ నాయకత్వం నన్ను శ్రధ్ధగా వినేలా చేసిందని” ఆమె కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ను సందేశాన్ని చూసిన మంత్రి కెటిఆర్ “మీతో జరిగిన సంభాషణను నేనూ ఎంజాయ్ చేశాను సుమా గారు” అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ఈ వీడియో చూసే ప్రజలు కూడా అలానే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.

Anchor suma meets minister ktr ahead of ghmc polls