Home తాజా వార్తలు ఆంధ్రా బ్యాంక్ లాభం రూ.70 కోట్లు

ఆంధ్రా బ్యాంక్ లాభం రూ.70 కోట్లు

Andhra Bank

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్ రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.70 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.434 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం గతేడాది (2018) రెండో త్రైమాసికంలో రూ.5,249 కోట్ల నుంచి రూ.5,603 కోట్లకు పెరిగింది. కేటాయింపులు రూ.1,732 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు తగ్గుముఖం పట్టాయి. నికర వడ్డీ ఆదాయం గతేడాది (2018)లో రూ.1,728 కోట్లు ఉండగా, ఈసారి రూ.1,694 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం రూ.1,298 కోట్ల నుంచి రూ.1,386 కోట్లకు పెరిగింది.

Andhra Bank posts net profit of Rs 70 cr in Q2