Thursday, April 25, 2024

ఎపిలో కోడి పందాలు జోరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఎపిలోని గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కోడిపందాలు అడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని పందెం రాయుళ్ళకు ఏలూరు డిఐజి పాలరాజు హెచ్చరించారు. ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను డిఐజి పాలరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడి పందాలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. కోడి పందాలు, వాటి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. గతంలో కోడి పందాలు నిర్వహించిన వారి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వీరిపై ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేసి, రూ. 5 లక్షల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారు. అయినప్పటికీ పందాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News