ఎంఎల్ఎ అంబటికి మరోసారి కరోనా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,132 కరోనా పరీక్షలు నిర్వహించగా, 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు శనివారం నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఎపిలో కరోనా సోకిన వారి సంఖ్య 871305కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు 8,58,115 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7024 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎపిలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు ఏపీలో 1,03,50,283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అంబటికి రెండో సారి :
ఎపిలోని సత్తెనపల్లి ఎంఎల్ఎ అంబటి రాంబాబుకు మళ్లీ రెండోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత జులైలో తనకు కొవిడ్ సోకిందని అయితే కొన్నిరోజులకే కోలుకున్నానని తెలిపారు. అసెంబ్లీలో మరోసారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. రీ ఇన్ఫెక్షన్కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంబటి పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్‌ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.