Friday, April 19, 2024

జంతు ప్రేమికుల దాతృత్వం

- Advertisement -
- Advertisement -

జూపార్కులోని వన్యప్రాణులు, పక్షుల…దత్తతపై పెరుగుతున్న మక్కువ..!!
పెద్దపులుల దత్తతలో ముందున్న ఎస్‌బిఐ
అదే కోవలో పలు వన్యప్రాణాలను అడాప్ట్ చేసుకున్న గ్లాండ్ ఫార్మా కంపెనీ
మయూరాన్ని మక్కువ చేసిన సినీనటుడు మహేష్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార
పుట్టినరోజు వేడుక బదులు 5 పక్షులను దత్తత తీసుకున్న బేబి సహస్రా, మాస్టర్ చర్విక్
వన్యప్రాణులపై మమకారం చూపిన మెగా కోడలు ఉపాసన, మాజీ ఐపిఎస్ అధికారి ఎన్.ఎస్.రామ్‌జీ

“మూగప్రాణులకు తమవంతు సేవ చేయాలనుకునే వారికి నెహ్రూ జూలాజికల్ పార్కు స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులు, పక్షుల ఆలనా పాలన సామాజిక బాధ్యతగా భావించి ముందుకు వచ్చే కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకర్లకు ఈ జంతు ప్రదర్శన శాలలో గ్రీన్ తివాచీ సిద్ధ్దంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే భారత దేశ బ్యాంకింగ్ రంగంలో పెద్దన్న అయినా ఎస్‌బిఐ ఇప్పటికే ఇక్కడి పెద్ద పులులను దత్తతకు వరుసాగా ప్రతి ఏడాది స్వీకరిస్తూ వస్తోంది. అలాగే ఫార్మారంగ దిగ్గజం గ్లాండ్ ఫార్మతోపాటు సినీనటుల కుటుంబ సభ్యులు, అవిశ్రాంత ఉద్యోగులు, ఐటీరంగ నిపుణులు ఉన్నారు. మీకు వన్యప్రాణులకు సేవ చేయాలనే కోరిక ఉంటే ఆ అవకాశం జూపార్కు కల్పిస్తోంది. అలాంటి జంతు ప్రేమికుల కోసమే ఈ ప్రత్యేక కథనం”

Animals adaption in Telangana

మన తెలంగాణ / రాజేంద్రనగర్ : వన్యప్రాణులను దత్తతకు స్వీకరించం ఓ కళనే. అందుకోసం పరితపించే వారు చాలా మందే ఉంటారు. కానీ తమకు ఇష్టమైన వన్యప్రాణి లేదా పక్షిని ఏ విధంగా దత్తతకు తీసుకోవాలో వారికి తెలియదు. అందుకోసం విస్తృతంగా సమాచారాన్ని జూకు వచ్చే సందర్శకులకు జూపార్కు నిర్వాహకులు అందిస్తున్నారు. దాంతో లాక్‌డైన్ కారణంగా కష్ట, నష్టాల్లో పురుకున్న జూ ఆర్థిక వనరులు ఇబ్బంది కరంగానే మారాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీ నుంచి పునఃప్రారంభం అయిన జూపార్కును తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువు లేదా పక్షిని ఎంచుకుని వాటి ఆలనా పాలనకు అయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్‌లో చేరుతున్నారు. అలా దత్తతకు స్వీకరింస్తున్న వారిలో సాధారణ సందర్శకులు మొదలు మెగా కొడలు కొణిదెల ఉపాసన, మహేష్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితారా, మాజీ ఐపిఎస్ అధికారి ఎన్.ఎస్. రామ్‌జీ, తుమ్మల రచన చౌదరి, గ్లాండ్ ఫార్మా కంపెనీ యానిమల్ అడాప్షన్ స్కీమ్‌లో చేరారు.
ఆహ్లాదంతో పాటు ఆనందం
జూపార్కులోనే సాధ్యం
జూపార్కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. గాండ్రించే పెద్దపులు, సింహాలు, చీత, చిరుతపులు నిత్యం సందర్శకులకు నిజారణ్యంలో అవి ఉన్నట్లుగా ఆకట్టుకుంటాయి. వన జాతిలో పలు రకాల కోతులు, చీతకోక చిలుకలు, చెంగు చెంగు గంతులు వేసే జింకలు, ఘీంకారనాదాలు చేసే గజరాజులు తమదైన శైలిలో సందర్శకులు తమ వైపు తిపుకుంటాయనడంలో అతిశయోక్తి లేదు. కిలకిలా రావాలు చేసే పక్షిజాతిలో రామ చిలుకలు, లవ్‌బర్డ్, మకావ్స్, కాకటేల్స్ ఇలా అనేక రకాల అరుదైన పక్షి సంధ జూపార్కులో అలరారుతోంది. తెల్లనెమలి, జాతీయ పక్షి పచ్చ నెమళ్ల సైయ్యాటలు వర్ణణాతీతంగా ఉంటాయనే చెప్పాలి.
చిట్టి చేతులతో పక్షులకు చేయూత
నెహ్రూ జూలాజికల్ పార్కును తిలకించడానికి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారులు తాము ఆపన్నహస్తం అందించడానికి సిద్ధ్దమని ముందుకు వచ్చారు.
అందుబాటులో ఉన్న యానిమల్ అడాప్షన్ స్కీమ్ వివవరాలు తెలుసుకుని ఐదు పక్షులను మూడు నెలల పాటు దత్తతకు స్వీకరించారు. అందుకు సంబంధించిన చెక్కును కటుంబ సభ్యులతో కలసి క్యూరేటర్ వివియల్. సుభద్రాదేవికి అందజేశారు. పక్షులను దత్తతకు స్వీకరించిన బేబి సహస్రా, మాస్టర్ చర్విక్ తమ పుట్టిన రోజు వేడుకకు ఖర్చు చేసే మొత్తాన్ని పక్షుల ఆహారం కోసం ఇచ్చామని తెలిపారు.
దత్తత స్కీమ్‌లో చేరండి..
వన్యప్రాణులకు సేవ చేయండి : క్యూరేటర్ వి.వి.యల్.సుభద్రాదేవి పిలుపు
పర్యావరణంలో వన్యప్రాణులు, పక్షుల పాత్ర ఏమిటో కళ ్లకు కట్టె విజ్ఞాన కేంద్రం నెహ్రూ జూలాజికల్ పార్కు అని క్యూరేటర్ వి.వి.యల్.సుభద్రాదేవి అన్నారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం అందుకోసం నిరంతరం కృషి చేస్తుందని, అందుకు నిదర్శనమే జూపార్కు నిర్వహణ అని ఆమె అన్నారు.
నగర జూపార్కు వన్యప్రాణుల పునరుత్పత్తి, ప్రదర్శనలో దేశంలోనే ఉత్తమ జూగా కొనసాగుతుందని తెలిపారు. అయితే వన్యప్రాణులకు సేవల చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అవకాశం కల్పించడానికి జూ సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమంతుగా జూలోని వన్యప్రాణులు, పక్షులను అడాప్ట్ చేసుకోవాలని కోరారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బ్యాంకర్లతో పాటు ఆర్థికంగా ఉన్న వివిధ రంగాల వారు జూపార్కు వచ్చి నేరుగా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. విద్యార్థి స్థాయిలో ఉన్న చిన్నారులు ఉత్సాహాంగా పక్షులు, వన్యప్రాణులను దత్తతకు స్వీకరిస్తుండడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News