Home జాతీయ వార్తలు హజారే షరతులకు కేంద్రం ఓకే

హజారే షరతులకు కేంద్రం ఓకే

ANNA-HAJARE

ఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహారదీక్ష మంగళవారనికి ఐదవ రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. లోక్‌పాల్‌ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందుకు ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేతో కలిసి చర్చలు జరిపారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో మంత్రి గిరీశ్ డిమాండ్లను అంగీకరిస్తామని తెలిపారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా, మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారని చేప్పారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో చాలా అంశాలను చేర్చాం అన్నారు. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్‌ పేర్కొన్నారు.