Home తాజా వార్తలు మోడీకి అన్నా హజారే లేఖ

మోడీకి అన్నా హజారే లేఖ

MODI--ANNA

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే బుధవారం లేఖ రాశారు. లోక్‌పాల్ నియామకంలో జరుగుతున్న జాప్యంపై హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌పాల్ బిల్లు కోసం మరో సారి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా లోక్‌పాల్‌ను నియమించకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్‌ను నియమించడంతో పాటు ప్రతి రాష్ట్రంలో లోకాయుక్తను నియమించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. లోక్‌పాల్‌తో పాటు రైతు సంక్షేమం, ఆహార భద్రత గురించి వివరిస్తూ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని మోడీని హజారే కోరారు.

Anna Hazare’s letter to Modi