Saturday, April 20, 2024

అన్నారం ఐదుగేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Annaram barrage Five gates open

భారీగా చేరిన నీటి ప్రవాహాం
అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం ఐదు గేట్లు బుధవారం ఎత్తారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి భారీ వరద నీరు చేరడంతో గత నెల 16వ తేదీ నుండి పంప్‌ల ద్వారా అన్నారం బ్యారేజ్‌కు నీటిని ఎత్తిపోస్తుండడంతో అన్నారం బ్యారేజి సామర్థత 10 టిఎంసిలకు గాను 10 టిఎంసిలు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఐదు గేట్ల దావరా 4500 క్యూసెక్కుల వరద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనితో అన్నారం బ్యారేజీ యొక్క నీటి సామర్థం 10 టిఎంసిలకు గాను 8 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

భారీగా చేరిన వరద నీరు…..

తెలంగాణ, మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో భారీగా వరద నీరు చేరింది. అన్నారం బ్యారేజ్ మానేరు నుండి 9వేల క్యూసెక్కుల వరద నీరు అన్నారం బ్యారేజ్‌కు చేరుకోగా, అదేవిధంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంది ప్రవహిస్తుంది. గోదావరి, ప్రాణహిత నదుల నుండి సుమారు 96,630 క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతానికి మేడిగడ్డ వద్ద 13 టిఎంసిల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

అప్రమత్తమైన అధికారులు……

అన్నారం బ్యారేజ్ సామర్థత 90 శాతం వరకు నిండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వరద నీరు వచ్చి చేరడంతో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్లు ఎత్తివేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి పారుదలశాఖ నుండి వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రిపూట చేపల వేటకు ఎవరు గోదావరిలోకి వెళ్ళకూడదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News