Thursday, April 25, 2024

యుకెలో ఆస్ట్రాజెనెకా టీకా వార్షికోత్సవం

- Advertisement -
- Advertisement -
Anniversary of the Astrazeneca vaccine in UK
ప్రపంచంలో 250 కోట్ల డోసుల పంపిణీ

లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకా వినియోగం ప్రారంభమై ఏడాది కావడంతో మంగళవారం యుకె ఆరోగ్యశాఖ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అదే టీకాను భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తోంది. 2021 జనవరి 4న యుకె వృద్ధుడు బ్రియాన్‌పింకర్(82)కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఈ టీకాను మొదటిసారిగా వినియోగించారు. ఇప్పటివరకు ఆస్ట్రాజెనెకా టీకాలు యుకెలో 5 కోట్ల డోసులమేర పంపిణీ అయ్యాయి. 250 కోట్ల డోసుల్ని 170 దేశాలకు ఎగుమతి చేశారు.

ఎగుమతైన టీకాల్లో ఎస్‌ఐఐ ఉత్పత్తి చేసినవి కూడా ఉన్నాయి. టీకా వినియోగానికొచ్చి ఏడాది గడిచిన సందర్భంగా యుకె ఆరోగ్యశాఖమంత్రి సాజిద్‌జావిద్ లండన్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. వార్షికోత్సవం సందర్భంగా జావిద్ మాట్లాడుతూ కొవిడ్ కట్టడిలో ఆస్ట్రాజెనెకా టీకాది కీలకపాత్ర అన్నారు. యుకెతోపాటు ప్రపంచంలోని కోట్లాది ప్రజల ప్రాణాల్ని ఈ టీకా కాపాడిందన్నారు. అమెరికా కంపెనీ ఫైజర్ రూపొందించిన టీకాను కూడా యుకెలో వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు యుకెలో 13.3 కోట్ల డోసుల టీకాల్ని పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News