Home తాజా వార్తలు ఆస్తులు ప్రకటించిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్

ఆస్తులు ప్రకటించిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్

SREESANTHముంబయి : క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయ నాయకుడిగా మారిన టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ కేరళలో బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు శ్రీశాంత్ తన ఆస్తుల అఫిడవిట్‌ను సమర్పించారు. తన మొత్తం ఆస్తులు ఏడు కోట్ల 37 లక్షలుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో 42 వేల ఐదు వందల రూపాయిలు, తన భార్య వద్ద 35వేల రూపాయలు ఉన్నాయని శ్రీశాంత్ వెల్లడించారు. తనకు కోటి 18 లక్షల విలువ చేసే జాగ్వార్ ఎక్స్‌జెఎల్ కారు, 30 వేల విలువ చేసే ఓ బైక్ ఉందని తెలిపారు. బైక్ కూడా క్రికెట్‌లో ఓ సారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ గెలిచినందుకు ఇచ్చిందని పేర్కొన్నారు.