Wednesday, April 24, 2024

3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ

- Advertisement -
- Advertisement -

3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ
బోయన్‌పల్లి కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అఖిలప్రియే ప్రధాన నిందితురాలు: నగర సిపి అంజనీకుమార్

Secunderabad Court dismiss Akhila Priya Bail Petition

మనతెలంగాణ/హైదరాబాద్: బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన నిందితురాలని, ఈ కేసులో కీలక పాత్ర వహించిన మరో ముగ్గురు నిందితులు మల్లికార్జున రెడ్డి, బాలచెన్నయ్యలను అరెస్ట్ చేసినట్లు సిపి అంజనీకుమార్ పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులోని నిందితులు మల్లిఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో సిమ్‌కార్డులు కొన్నారని, ఈ సిమ్ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని సిపి వెల్లడించారు. ఈక్రమంలో అపహరణ కేసులో కీలక పాత్ర వహించిన అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్టు చేశామని, కిడ్నాప్ కి ముందు నిందితులు బోయిన్ పల్లిలో రెక్కీ నిర్వహించారని వెల్లడించారు. అఖిల ప్రియ సూచన మేరకే ప్రవీణ్‌రావు ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని సిపి చెప్పారు. అలాగే కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్న సిపి నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మ్యాప్ ద్వారా చూపించారు. నిందితులు వాడిన ఫోన్లు, వాహనాల నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కిడ్నాప్ సమయంలో నిందితులు వాహనాలకు నకిలీ నంబర్‌ప్లేట్లు బిగించారు. కాగా కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి కిడ్నాపర్ల నుంచి డిసిపికి కూడా ఫోన్ వచ్చింది. ప్రవీణ్ సోదరులు ముగ్గురిని వదిలేస్తున్నట్లు కిడ్నాపర్లు డిసిపికి ఫోన్ చేశారు. పోలీసుల విషయంలో నిందితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగుందని వైద్యులు ధ్రువీకరించారు. అఖిలప్రియను 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మూడ్రోజుల విచారణ అనంతరం మిగతా విషయాలను వెల్లడిస్తామని సిపి వివరించారు.
కాల్స్ ఆధారంగా విచారణ:
విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు టవర్ లోకేషన్ల ట్రేసింగ్ చేశామని, భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనుకు నిందితులు టచ్‌లో ఉన్నారన్నారు. కూకట్‌పల్లి లోదా నుంచి యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌కి భార్గవ్‌రామ్ వచ్చారని, అఖిలప్రియను అరెస్ట్ సమయంలో మహిళా ఇన్‌స్పెక్టర్ ఉన్నారని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడంలో కూడా నిర్లక్ష్యం లేదని, పోలీసులపై ఆరోపణలన్నీ అవాస్తవానని సిపి వివరించారు. అఖిలప్రియ నెంబర్ నుంచి గుంటూరు శ్రీనుకు 49 ఫోన్ కాల్స్ చేశాడని, గుంటూరు శ్రీను నుంచి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్ వచ్చాయన్నారు. గుంటూరు శ్రీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్ వచ్చాయనిచ కిడ్నాప్ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో శ్రీను మాట్లాడాడన్నారు. కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశామని, కిడ్నాప్ కోసం టెంపరరీ సిమ్స్‌లను గ్యాంగ్ ఉపయోగించిందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
బెయిల్ తిరస్కరణః బోయినపల్లి కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
మూడూ రోజల పోలీసు కస్టడి: బోయిన్‌పల్లి పోలీసులు అఖిలప్రియను కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మూడు రోజుల పాటు విచారించనున్నారు. ముందుగా ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలు అఖిలప్రియ నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదన విన్న కోర్టు అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. సోమవారం నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి అఖిలప్రియను మూడు రోజుల పాటు అఖియప్రియను పోలీసులు విచారించినున్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.చంచల్‌గూడ జైలు నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఆమె విచారించనున్నారు

Another 3 Arrested in Bowenpally Kidnap Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News