Friday, April 19, 2024

నగరానికి మరో 4 రోజులు వాన గండం

- Advertisement -
- Advertisement -

Another 4 days of rain for hyderabad

ఇప్పటీకే వణికుతున్న నగరవాసులు
పట్టించుకోని పాలక మండలి

హైదరాబాద్: కుండపోత వర్షానికి భాగ్యనగరం అతులాకుతలం అవుతోంది. ఇప్పటీకే గత 4 రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటకే జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. మరో వైపు మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను ప్రకటించడంతో నగరవాసులు గుండెళ్లో రైలు పరుగులు పెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు రోడ్లపై పరుగులు తీస్తుతుండడంతో దుర్వాసనతో బస్తీలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది కాలనీలు, బస్తీల్లో ఇంటి నుంచి బయటికి కాలు పెట్టె పరిస్థితి కూడా లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటీకే నగరంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు పూర్తిగా నీటి సామర్థానికి చేరుకోవడంతో గేట్ల ద్వారా దిగువకు నీరును విడుదల చేస్తుండగా, గ్రేటర్ పరిధిలోని హుస్సెన్ సాగర్ మొదలు అన్ని చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అంతేకాకుండా పలు చెరువులు అలుగులు పారుతుండడంతో దిగువ ప్రాంతంలో ఉన్న కాలనీలు, బస్తీలు పూర్తిగా జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. నగరంలో మరింత భారీ వర్షం కురిస్తే చెరువులు, కుంటల కట్టలు తెగే ప్రమాదంలేకపోలేదు. ఇప్పటీకే ఎల్‌బినగర్‌లోని పరిసర ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. సరూర్ నగర్ చెరువు పొంగిపోర్లుతుండడంతో గడ్డి అన్నారం డివిజన్‌లోని పలు కాలనీలు బస్తీలతో పాటు దిగవన ఉన్న కోదండరామ్ నగర్, సీసల బస్తీ, పాటు పలు కాలనీలను వరద నీరు ముచెంత్తుతోంది. మరో వైపు మూసి పరివాహక ప్రాంతంలోని బాపు ఘాట్ మొదలు నాగోల్ వరకు ఉన్న కాలనీలు, బస్తీల వాసులను జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటీకే ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన అధికారులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనావేస్తున్నారు.

పట్టించుకోని పాలక మండలి 

గడచిన 4 రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిహెచ్‌ఎంసి పాలకమండలి గాని ఉన్నతాధికారులు గాని కనీసం పట్టించుకున్న దాఖలు కూడా కనిపించడంలేదు. గతంలో నగరంలో 3 సె.మి.ల మించి వర్షం కురిస్తే చాలు బల్ధియా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం ద్వారా మేయర్ మొదలు కమిషనర్ వరకు ఎప్పటీకప్పుడు తాజా పరిస్థితులను పర్యవేక్షించడమే కాకుండా అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా అధికారులకు దిశా నిర్దేశనం చేసేవారు.

అయితే గడిచిన 4 రోజులుగా పలు ప్రాంతాల్లో 10 సె.మి.లకు మించి వర్షం కురవడమే కాకుండా నగరమంతా చెరువులను తలపించినా ఇటు పాలక మండలి గాని అటు జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు సైతం కనీసం సమిక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. కనీసం మీడియా ద్వారా నగరం వాసుల్లో ధైర్యం నింపేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమన్హారం. కేవలం కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ముంపు బాధితులు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో 3 రోజులుగా జలదిగ్బంధనంలో చిక్కుకున్న తమను ఏ ఒక్కరూ కూడా పలకరించిన వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News