Home తాజా వార్తలు అంతరిస్తున్న మరో 7 వేల తెగల వన్య ప్రాణులు

అంతరిస్తున్న మరో 7 వేల తెగల వన్య ప్రాణులు

Tigerమనిషి వల్ల ప్రకృతికి జరుగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కొన్ని వన్యప్రాణి జాతులు అంతరించి పోతున్నా యి. వన్యమృగాలు, మత్స సంపద, వృ క్షాల రకాలు, దాదా పు మొత్తం మరో ఏడు వేల రకాలు అంతరించి పోయే జాబితాలో ఇప్పుడు చేరాయని ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సమాజం (ఇంటర్నేషనల్ యానియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచర్‌ఐయుసిఎన్) హెచ్చరించింది. ఈ సమాజం ప్రపంచం మొత్తం మీద 1,05,000 తెగలను సమీక్షించింది. వీటిలో 28,000 తెగలు చాలా ప్రమాదంలో ఉన్నాయని, వివరించింది. ప్రతి తెగ ఏదో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

మితిమీరిన వేట, అడవుల నరికి వేత, వంతి మనుషుల విధ్వంసక చర్యలే వన్యప్రాణి సంతతి విపరీతంగా నశించిపోడానికి దారి తీస్తున్నాయి. మానవ చరిత్రలో ఊహించని విధంగా ప్రకృతి విధ్వంసం అవుతోంది. ఈ వాస్తవాన్ని తెలుసుకుని ప్రకృతిని సంరక్షించడానికి ముందడుగు వేయడమే తక్షణ కర్తవ్యమని ఐయుసిఎన్ కార్యాచరణ డైరక్టర్, జనరల్ గ్రీథెల్ అగ్విలర్ హెచ్చరించారు. సముద్ర ప్రాణుల్లో ఐడ్జి చేపలు, గిటారి చేపలు, రైనోరేలు, తదితర చేపలు వాటి పొడుచుకు వచ్చే వెడల్పైన ముట్టి కారణంగా ఇప్పుడు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మారిటేనియా సముద్ర జలాల్లో అడ్డూఆపూ లేని చేపల వేట కారణంగా అరుదైన షార్క్‌రే చేపలు అంతరించి పోతున్నాయి. గత 45 ఏళ్లలో వీటి సంతతి 80 శాతం తగ్గిపోయింది. అలాగే ఏడు రకాల వానర జాతులు అంతమొందే జాబితాలో చేరాయి. రోలోవే వంటి వానర జాతులు క్షీణిస్తున్నాయి. ఈ తెగకు చెందిన 2 వేలు మాత్రమే ప్రస్తుతం అడవుల్లో మిగిలి ఉన్నాయి. మాంసం కోసం వీటిని చంపుతున్నారు. వీటికి నిలువ నీడ లేకుండా అడవులను నరుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలుగా, నివాస భవనాలుగా మారుస్తున్నారు. ఇవన్నీ వన్యప్రాణుల మనుగడకు ముప్పు తెస్తున్నాయి.

Another 7000 species are endangered