Wednesday, April 24, 2024

తపోవన్ సొరంగంలో మరో మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

Another body was found in Tapovan tunnel

గోపేశ్వర్(ఉత్తరాఖండ్): రిషిగంగా ప్రాజెక్టు దుర్ఘటన జరిగి ఏడాది అయిన తర్వాత తపోవన్‌లోని ఎన్‌టిపిసి హైడల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన సొరంగంలో మరో మృతదేహం లభించింది. తపోవన్-విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్టు వద్ద సొరంగంలోపల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా ఒక మృతదేహం లభించినట్లు తపోవన్ వద్ద ప్రాజెక్టు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7న భారీ వర్షాలకు వరద ముంచెత్తి రిషిగంగా నది పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతంలోని హైడల్ ప్రాజెక్టులకు భారీ నష్టం ఏర్పడింది. తపోవన్-విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 140 మందికి పైగా సిబ్బంది వరదల్లో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 37 మృతదేహాలు లభించగా 103 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ఈ నెల 15, 21 తేదీలలో కూడా సొరంగంలో మృతదేహాలు లభించాయి. మంగళవారం లభించిన మృతదేహం 25 సంవత్సరాల దీపక్ తమ్తాదని, చమోలీ జిల్లా జోషీమఠ్ సమీపంలోని రవిగ్రామ్ నివాసి అని అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News