Monday, July 14, 2025

నటి కల్పికకు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటి కల్పికకు (Actress Kalpika) దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పటికే ప్రిజమ్ పబ్‌లో కల్పిక చేసిన రచ్చకు ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పుట్టినరోజు కేసు విషయంలో పబ్ నిర్వాహకులు కల్పిన మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా నటి కల్పికపై (Actress Kalpika) మరో కేసు నమోదైంది. తనని సోషల్‌మీడియాలో కల్పిక అసభ్యపదజాలంతో దూషించిందంటూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్ అబ్యూజింగ్‌తో పాటు తనపై వేధింపులకు పాల్పడిందంటూ కీర్తన ఆరోపించారు. సోషల్‌మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంత పాటు బాధితురాలికి పెట్టి వలర్గ్‌గా మాట్లాడిందని ఫిర్యాదులో కీర్తన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, మిగితా ఆధారాలు పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కల్పికపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News