Home జాతీయ వార్తలు జమ్ముకశ్మీర్‌లో మరో మాజీ హిజుబుల్ ఉగ్రవాది అరెస్టు

జమ్ముకశ్మీర్‌లో మరో మాజీ హిజుబుల్ ఉగ్రవాది అరెస్టు

Another former Hizbul militant arrested in Jammu and Kashmir

 

జమ్ము : గత 19 ఏళ్లుగా పోలీసులు గాలిస్తున్న మరో మాజీ హిజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది డుల్లా అలియాస్ జమీల్‌ను జమ్ముకశ్మీర్ కిష్తార్ జిల్లాలో అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. రియాసి లోని అర్నాస్ గ్రామానికి చెందిన జమీల్ పరారీలో ఉన్న మూడో మాజీ ఉగ్రవాది అని పోలీసులు చెప్పారు. నిర్దిష్ట సమాచారంతో అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరపడంతో ఈ అరెస్టు జరిగిందని, ప్రస్తుతం చత్రూ ఏరియాలో కుంద్వార్ గ్రామంలో ఉంటున్నాడని చెప్పారు. 2002 లో చత్రూ పోలీస్ స్టేషన్‌లో నమోదైప ఉగ్రవాద సంబంధిత కేసులో డుల్లా కావలసి ఉందని, అప్పుడు అరెస్టు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టగా జ్యుడీషియల్ కస్టడీకి పంపారని చెప్పారు. అంతకు ముందు 12 నుంచి 19 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు మాజీ ఉగ్రవాదులు నజీర్ అహ్మద్, అబ్దుల్ గనీలను ఈనెల 15,17 తేదీల్లో పోలీసులు అరెస్టు చేశారు.