Home తాజా వార్తలు బాలుడి కిడ్నాప్ కలకలం..

బాలుడి కిడ్నాప్ కలకలం..

Kidnap

 

హైదరాబాద్ : బాలుడి కిడ్నాప్ కేసును కొన్ని గంటల్లోనే చేధించిన సంఘటన రాచకోండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకోండ సిపి మహేష్ భగవత్, ఎల్బీనగర్ డిసిపి సర్‌ప్రీతిసింగ్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ కార్పోరేషన్ పరిధిలో పిఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుర్రం రాజు కూమారుడు (7) ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యహ్నం సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటుండగా, బాలునికి మాయ మాటలు చెప్పిన ఓ మైనర్ బాలుడు మీర్‌పేట్ నుంచి అల్మాస్‌గూడ వరకు తీసుకెళ్లి బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలుడి తండ్రి మీర్‌పేట్ పియస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

బాలుడి తండ్రి కిడ్నాపర్‌కు డబ్బులు ఇస్తానని తెలిపాడు. పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా కిడ్నాపర్‌ను గుర్తించారు. కిడ్నాపర్ నుంచి బాలుడి క్షేమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ పదవ తరగతి చదువుతు చెడు దుర్గుణాలకు అలవాటు పడి డబ్బులు డిమాండు చేశారు. కిడ్నాపర్‌ను జువైనల్ హోంకు తరిలించారు. కేసు ఛేదించిన మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ యాదయ్య ,ఎస్‌ఐ మారయ్య, సిబ్బందిని సిపి అభినందించారు.

Another Minor Boy Kidnapped minor boy