Thursday, April 25, 2024

యాక్షన్ డైరెక్టర్‌తో మూవీ

- Advertisement -
- Advertisement -

Another movie in Allu Arjun-Boyapati Combo?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మరో బంపర్ ఆఫర్ తగిలిందట. సుకుమార్, కొరటాల సినిమాల తరువాత స్టార్ హీరో అల్లు అర్జున్…బోయపాటితో ఓ ఫుల్ యాక్షన్ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సుకుమార్‌తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమా ఓ పజిల్ లాగా స్క్రీన్‌ప్లే సాగుతుంది. అందుకే కేవలం మాస్ ప్రేక్షకుల కోసమని తన తరువాత సినిమాని బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పైగా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కూడా. అయితే రామ్‌చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం తరువాత మరో సినిమా చేయడానికి బోయపాటి చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బోయపాటి… నందమూరి బాలకృష్ణతో చేస్తోన్న సినిమాలో యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రియలిస్టిక్ యాక్షన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాను రియలిస్టిక్ యాక్షన్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించాలని బోయపాటి భావిస్తున్నాడు.

Another movie in Allu Arjun-Boyapati Combo?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News