Home జాతీయ వార్తలు దేశంలో మరో ఒమిక్రాన్ కేసు

దేశంలో మరో ఒమిక్రాన్ కేసు

Another omicron case in india

 

టాంజానియా నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్
భారత్‌లో ఐదుకు చేరిన సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడగా, తాజాగా ఢిల్లీలో మరో కేసు నిర్ధారణ అయింది. ఇటీవల టాంజానియా నుంచి భారత్‌కు వచ్చిన వ్యక్తి (37) కి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు గుర్తించారు. బాధితుడు ఇప్పుడు నగరం లోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీలో నమోదైన తొలి కేసు ఇదే. బాధితుడి ప్రయాణ వివరాలు సేకరించిన అధికారులు అతనితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరినీ వెతికే పనిలో పడ్డారు. ఇంతకు ముందు కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు. శనివారం మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందిన వారు. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసులు మొత్తం ఐదుకు చేరాయి.

Another omicron case in india