Home తాజా వార్తలు జియోనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్

జియోనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్

jioni
ముంబయి: జియోనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రానుంది. త్వరలో జియోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ’ఎం7 పవర్’ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ రూ. 19,590 వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థం ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఇంచ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

జియోనీ ఎం7 ఫీచర్లు..
6ఇంచ్ హెచ్‌డి ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మోగాపిక్సల్ సెల్పీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ చార్జింగ్, 4జీ వీవోఎల్‌టిఈ, బ్లూటూత్ 4.2,5000 ఎంఏహెచ్ బ్యాటరీ.