Friday, March 29, 2024

మరో ప్యాకేజీ!

- Advertisement -
- Advertisement -

MODI

 

 

లాక్‌డౌన్ తర్వాత ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశీలిస్తున్న కేంద్రం
పలు సంక్షేమ పథకాల్లోనూ
మార్పులు, చేర్పులు
మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, సిఎం కెసిఆర్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో ప్రధాని మోడీ ఫోన్ మంతనాలు, లాక్‌డౌన్ ఎత్తివేతపై సలహాలు, సూచనలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దేశంలో పరిస్థితు లు ఎలా ఉండనున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక వేళ 15న లాక్‌డౌన్ ఎత్తివేస్తే దేశంలో కరోనా వైరస్ ప్ర భావాన్ని వీలయినంత మేరకు తగ్గించడానికి, ఇప్పటికే కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే ఈ ప్యాకేజికి ఇంకా తుది రూపం ఇవ్వలేదు. ఈ నెల 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టిపెడుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. మరో ప్యాకేజీని ప్రకటించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. దేశంలో వినియోగాన్ని తిరిగి పెంచాలనే దానిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతోందని, అందుకే కొన్ని ఉద్దీపక చర్యలు అవసరం కావచ్చని ఆయన తెలిపారు.

ఒక వేళ ప్రభుత్వం గనుక మరో ప్యాకేజిని ప్రకటిస్తే శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రకటించిన మూడో ప్యాకేజి అవుతుంది. గత నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులకోసం పలు ప్రోత్సాహక చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోరెండు రోజుల తర్వాత ఆర్థిక మంత్రి లాక్‌డౌన్ ప్రభావం కారణంగా తీవ్రంగా నష్టపోయే వారి కోసం రూ.1.7 లక్షల కోట్ల సహాయక ప్యాకేజిని ప్రకటించారు. కాగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులకు సరిపోయే విధంగా కొన్ని సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ పథకాలలో మార్పులు చేసే అవకాశాలను తాము పరిశీలిస్తున్నట్లు అధికారులు ఆదివారం చెప్పారు.

వివిధ మంత్రిత్వ శాఖలు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, రబీ పంటల కోతలు లాంటి అనేక విషయాలు చర్చకు వస్తున్నాయని, ఒకదాని తర్వాత ఒకటిగా వీటికి పరిష్కార మార్గాలను కనుగొనడాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వారు చెప్పారు. కోవిడ్19కు దేశ ప్రజల స్పందనను రూపొందించడానికి సీనియర్ అధికారులతో ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పది సాధికారిక బృందాల్లో ఒకదానికి ఆర్థిక చర్యలను సూచించే బాధ్యతను అప్పగించారు. కాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా లాక్‌డౌన్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తోంది.

 

Another stimulus package
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News