Home జాతీయ వార్తలు జమ్మూలో ఎదురుకాల్పులు

జమ్మూలో ఎదురుకాల్పులు

Breaking-Newsశ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులు ఇప్పట్లో అగేలా లేవు. తాజాగా శ్రీనగర్ పరిధిలోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని ఓ భవనంలో ఉగ్రవాదులు నక్కి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. కాగా, భవనంలో ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులు ఉండొచ్చని భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.