Friday, April 26, 2024

‘ఆర్ఆర్ఆర్’ నుంచి సిద్ధమౌతున్న మరో వీడియో!

- Advertisement -
- Advertisement -

 'RRR'

 

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోని రాజమౌళి విడుదల చేస్తారేమోనని అభిమానుల ఆశ. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు కూడా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే పురస్కరించుకొని ఓ వీడియోని చిత్రయూనిట్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్య స్పందించాడు. మే 20న జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఒక బహుమానం సిద్దమవుతుందని దానయ్య ప్రకటించాడు. అభిమానుల కోసం చిత్రయూనిట్ ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోని సిద్ధం చేస్తున్నట్లు తెలిసిపోయింది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా, ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా మరోసారి వాయిదా వేసినట్లు సమాచారం.ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన అలియాభట్ నటిస్తుండగా, కొమరం భీం పాత్రలో నటిసస్తున్న ఎన్టీఆర్ సరసన హాలివుడ్ హీరోయిన్ ఓలివియా నటిస్తోంది.

Another video Ready for NTR’s Fans from ‘RRR’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News