Home తాజా వార్తలు రేఖ, శ్రీదేవికి ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులు

రేఖ, శ్రీదేవికి ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులు

 

హైదరాబాద్: దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు(ఏఎన్‌ఆర్) జాతీయ పురాస్కారాల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరుగింది. ఈ క్యాక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 2018 ఏడాదికి గానూ దివంగత నటి శ్రీదేవికి, 2019 ఏడాదికి గానూ ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, రేఖలకు చిరంజీవి పురాస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు రేఖ, బోనీకపూర్ లతోపాటు మెగాస్టార్ చిరంజీవి, కళాబంధు సుబ్బిరామిరెడ్డి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, నాగసుశీల, సుమంత్, సుశాంత్, విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

 

ANR National Awards Ceremony 2019 at Annapurna Studio