Friday, March 29, 2024

కరోనా రోగులకు ఆశాకిరణం ‘ఇంటర్ ఫెరాన్’

- Advertisement -
- Advertisement -

interferon

టొరంటో : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని ఎలాగైనా నిర్మూలించాలన్న పట్టుదలతో అనేక దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పరిశోధకులు ప్రస్తుతం వివిధ వైరస్ వ్యాధులకు వాడుతున్న ఔషధాలు ఏవైనా ఉపయోగపడతాయా ? అన్న (కోణంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో ఇంటర్ ఫెరాన్ (ఐఎఫ్‌ఎన్)ఏ2బీ డ్రగ్ కరోనా రోగుల చికిత్సకు బాగా ఉపయోగపడుతుందని, వైరస్‌ను వేగంగా నిర్మూలిస్తుందని టొరంటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇన్‌ఫ్లమేటరీ (మంట) ప్రొటీన్ల స్థాయిలను కూడా ఇది తగ్గిస్తుందని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ యాంటీవైరల్ డ్రగ్ కరోనా నిర్మూలనకు ఉపయోగపడుతుందని పరిశోధనలో బయటపడడం కరోనా రోగులకు నిజంగావరం లాంటిదే. వైరస్ సోకినప్పుడు జరిగే ఇన్‌ఫ్లమేటరీ స్పందనలో రోగ నిరోధక వ్యవస్థలోని ఇంటర్‌ల్యూకిన్ (ఐఎల్)6, సిరియాక్టివ్ ప్రొటీన్ విడుదల అవుతాయి. ఈ ప్రొటీన్ల స్థాయిలను ఇంటర్ ఫెరాన్ తగ్గిస్తుందని పరిశోధకులు వివరించారు. ఇమ్యునాలజీ జర్నల్‌లో ఈ వివరాలు వెలువడ్డాయి.

కొత్త వైరస్ వ్యాపించినప్పుడు ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి బదులు, ఈ ఇంటర్ ఫెరాన్‌ను చికిత్సలో వాడడం మంచిదని శాస్త్రవేత్త ఎలినార్ ఫిష్ సూచించారు. ఈ పరిశోధనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటర్ ఫెరాన్‌ను వైద్య పరంగా వినియోగించడానికి కొన్నేళ్ల క్రితమే అనుమతి ఉంది. కణాలు, కణజాలాల మధ్య భావ ప్రసారానికి ఇంటర్ ఫెరాన్స్ సహకరిస్తాయి. రక్షణకు ముందుంటాయి.

Antiviral drug interferon can speed up recovery of Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News