Thursday, April 25, 2024

నాకు కరోనా వస్తే సిఎం మమతను కౌగిలించుకుంటా

- Advertisement -
- Advertisement -

Anupam Hazra controversial remarks on CM Mamata Banerjee

 

బిజెపి నూతన జాతీయ కార్యదర్శి హజ్రా వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా : బిజెపి నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రా రోజైనా గడవకముందే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశౠరు. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కరోనా కేసుల విషయంలో టిఎంసి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందని బిజెపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ హజ్రా మాట్లాడుతూ ‘నాకు ఎప్పటికైనా కరోనా తప్పకుండా వస్తుంది. నేను అప్పుడు వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటా. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, బంధవులను కోల్పోయిన వారు పడుతున్న బాధలు తెలుస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News