Home తాజా వార్తలు ‘ఆర్‌ఆర్‌ఆర్’లో గెస్ట్ అప్పియరెన్స్?

‘ఆర్‌ఆర్‌ఆర్’లో గెస్ట్ అప్పియరెన్స్?

Anushka

 

‘బాహుబలి’ చిత్రం తర్వాత హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం ’నిశబ్దం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదే సమయంలో ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తోంది. ఇప్పటికే ’సైరా’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కొన్ని నిమిషాల పాటు అలరించింది. ‘సైరా’లో ఉన్నది కొద్ది సమయమే అయినా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమాలో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’.

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్‌తో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రంలో అనుష్కను కూడా భాగస్వామి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో కావాలని పాత్రలను సృష్టించరు. కథానుసారంగానే పాత్రలను సృష్టిస్తారు. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ఒక చిన్న పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. అయితే ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.

Anushka Guest Appearance in RRR movie