Thursday, April 25, 2024

ఆ సమయంలో ఏడుపొచ్చేసేది

- Advertisement -
- Advertisement -

Anushka Shetty recall memories of 'Super' Movie

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం. తెరపై ఎంత బోల్డ్‌గా కనిపించినా ఆఫ్ స్క్రీన్ ఆమె చాలా క్యూట్‌గా, చాలా స్వీట్‌గా కనిపిస్తుంటుంది. ఇప్పటిదాకా ఏ సినిమా ఫంక్షన్‌లోనూ అనుష్క బోల్డ్ లుక్‌లో కనిపించలేదు. స్క్రీన్ మీద మాత్రం ఈ భామ హాట్ లుక్‌లో చెలరేగిపోతుంటుంది. ఇక నటన, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కన పెడితే… స్వీటీ మనసు చాలా గొప్పది. అందుకే ఆమెను ఇష్టపడనివారెవరూ ఉండరు సినీ పరిశ్రమలో. ‘బాహుబలి’ సినిమాతో అనుష్క పేరు దేశవ్యాప్తగా మార్మోగిపోయింది. కానీ ఈ స్టార్ బ్యూటీ నటనలో ఓనమాలు నేర్చుకున్నది మాత్రం తొలి సినిమా ‘సూపర్’తోనే. అందుకే రాజమౌళి, పూరి జగన్నాథ్.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రుణపడి వుంటావు…? అని ప్రశ్నిస్తే… ‘పూరి జగన్నాథ్’ అని ఠక్కున సమాధానమిచ్చింది.

మామూలుగా అయితే రాజమౌళి పేరుగానీ, ‘అరుంధతి’ సినిమాతో తనను జేజెమ్మగా మార్చిన కోడి రామకృష్ణ పేరుగానీ చెప్పాలి. కానీ అనుష్క మాత్రం ఎక్కి వచ్చిన తొలి మెట్టుని మాత్రం మరచిపోలేదు. ‘సూపర్’ సినిమా చేయకుంటే అసలు తానేంటో ఎవరికీ తెలిసేది కాదంటూ తొలి సినిమాని గుర్తుచేసుకుంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తనకు డ్యాన్స్ రాదనీ, నటన కూడా రాదనీ… అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గరి నుంచి ప్రతి ఒక్కరూ తనను ప్రోత్సహించారని అనుష్క తెలియజేసింది. అలా అందరూ తనని ప్రోత్సహిస్తున్న తీరు చూసి ఆ సమయంలో తనకు ఏడుపొచ్చేసేదనీ స్వీటీ చెప్పుకొచ్చింది.

Anushka Shetty recall memories of ‘Super’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News