Friday, April 19, 2024

అకస్మాత్తు లాకౌట్‌తో ఆందోళన, గందరగోళం

- Advertisement -
- Advertisement -

Rahul gandhi

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. పెద్ద దేశాలు పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ భారత్‌లో మాత్రం పరిస్థితులు విచిత్రంగా వేర్వేరుగా ఉంటాయని, వీటిని అర్థం చేసుకోవడం కష్టమని ఆయన అన్నారు.

దేశంలో దినసరి వేతన కార్మికులు ఎక్కువని, కరోనా వల్ల అన్ని సంస్థలు మూసివేయడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు. ఫ్యాక్టరీలు, చిన్న పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాలు మూతపడడంతో వేలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు ఇళ్లకు చేరుకోడానికి సాహస యాత్ర సాగిస్తున్నారని అలాంటి వర్గాలకు ఆశ్రయం కల్పించడానికి, నేరుగా వారికి నగదు అందించ డానికి సహకరించాలని సూచించారు. మరి కొన్ని నెలల పాటు వారిని ఆదుకోడానికి వారి బ్యాంకు అకౌంట్లలో నగదు పడేలా చూచాలని కోరారు.

సంపూర్ణ లాక్‌డౌన్ ఫలితంగా మిలియన్ల మంది నిరుద్యోగ యువత తమ గ్రామాలకు భారీ ఎత్తున చేరుకోడానికి మూకుమ్మడిగా బయలు దేరుతారని, దీనివల్ల కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వయోవృద్ధులను ఒంటరి చేసి వారికి వైరస్ సోకకుండా రక్షించాలని సూచించారు. వృద్ధులకు కరోనా ప్రమాదంపై యువతకు అవగాహన కల్పించాలని కోరారు.

Anxiety and confusion with sudden lockout
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News