Friday, March 29, 2024

ఎపి అసెంబ్లీలో కీలక బిల్లుల అమోదం

- Advertisement -
- Advertisement -

AP Assembly house approved the Panchayati Raj Act

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం నాడు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సిఆర్‌డిఎ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జిఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు, 2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.

దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎంఎల్‌ఎ కొలుసు పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే టిటిడిలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని అన్నారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నేటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News