Home తాజా వార్తలు ఎపి వర్షాకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం

ఎపి వర్షాకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం

AP Assembly Monsoon Session Started

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి ఏడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశానికి ముందు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో బిఎసి సమావేశం జరిగింది. శాసన సభలో  ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ పైకప్పు నుంచి నీళ్లు వచ్చి పడుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్‌కోట్లతో వచ్చామని బిజెపి నేతలు ఎద్దేవాచేశారు. అసెంబ్లీ నిర్మాణంలో రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు.