Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జగన్, బాబు చేత ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్…

జగన్, బాబు చేత ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్…

jaganఅమరావతి: ఎపి 15 అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు సిఎం వైఎస్ జగన్ చేత పులివెందుల ఎంఎల్ఎగా ప్రమాణస్వీకారం చేయించారు. జగన్ అనంతరం టిడిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి చేత కుప్పం ఎంఎల్ఎగా ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సభలో అందరికీ నమస్కరిస్తూ జగన్ అసెంబ్లీలోకి వెళ్లారు. వీరి తర్వాత మంత్రులు అంజాద్ బాషా, మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత తదితరులు కూడా ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. టిడిపి 23 సీట్లతో సరిపెట్టుకుంది.

AP Assembly Sessions 2019