Home Default దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం జగన్‌

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం జగన్‌

AP CM Jagan Visits Kanaka Durgamma Templeవిజయవాడ : ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను మంగళవారం  దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను జగన్ సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సిఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య జగన్‌ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనానంతరం  వేద పండితులు జగన్ కు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.