Tuesday, March 5, 2024

సిఎం జగన్ ఇంట విషాదం

- Advertisement -
- Advertisement -

AP CM YS Jagan Uncle EC Gangi Reddy died

అమరావతి: ఎపి సిఎం వైఎస్ జగన్‌ ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఇసి గంగిరెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం బారినపడిన గంగిరెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపిపిగా విధులు నిర్వహించారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారని కుటుంసభ్యులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News