Saturday, April 20, 2024

ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జగన్

- Advertisement -
- Advertisement -

AP Districts alert for Heavy rains

అమరావతి: నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ సూచించారు. వర్షాలపై అధికారులతో ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు జరిపారు. వర్ష ప్రభావిత జిల్లా కలెక్టర్లతో వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయని వివరించారు. కర్నూలుల్లో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేశామని, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బాధితులకు 1000 రూపాయల చెప్పున అందజేయాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News